Wednesday, 20 November 2013

ఆంధ్రప్రదేశ్ విభజనకు సహకరిస్తే ఎన్‌టీఆర్ కు భారతరత్న: నారా నందమూరి ఫేమిలీకి సోనియా బంపర్ ఆఫర్

 ఏంటీ ? షాకయ్యారా ... నిజమే. ముందు వెనుకలు ఆలోచించకుండా విభజన ఖాయమైతే సీమాంధ్రకు 5 లక్షల కోట్లు ప్యాకేజీ అడిగిన చంద్రబాబు సోనియా ఈ ఆఫర్‌ను ముందుంచిన వెంటనే తన నారా నందమూరి ఫేమిలీలను( దగ్గుబాటి ఫేమిలీతో కలిపి) సమావేశ పరచి సోనియా ఆఫర్ను వాళ్ళ ముందుంచాడు. ఆఫర్‌తో పాటు సోనియా చిన్న కండిషన్ కూడ పెట్టింది. విభజన సమయంలో తలెత్తే సమస్యలలో నందమూరి హీరోలు ప్రజల పక్షాణ (అంటే సీమాంధ్రుల పక్షాణ) ఉండకూడదు. అంటే సైలెంట్‌గా ఉండాలని. విభజనకు వ్యతిరేకంగా నోరు విప్పడం కానీ విమర్శలు చేయడం కానీ ఉద్యమాలకు నాయకత్వం వహించడం కానీ చేయరాదని సోనియా కండిషన్ పెట్టింది. పార్టీలు వేరైనా నందమూరి ఫేమిలీ( పురంధేశ్వరితో కలిపి) తమకు ప్రత్యక్షంగానే సహకరిస్తుండటంతో వారి అభీష్టం మెరకు నందమూరి హీరోలను సంతృప్తి పరచడం కోసం పార్లమెంటులో NTR విగ్రహం పెట్టించి వారి అభిమానాన్ని చూరగొన్న సోనియా తమకు ఇంకో బంపర్ ఆఫర్‌ను తమ ముందుంచడంతో ఉబ్బి తబ్బిబ్బయ్యి తమ అంగీకారాన్ని తెలిపారు. కాకపోతే వాళ్ళు కూడ ఒక కండిషన్ పెట్టి మరీ తమ అంగీకారాన్ని తెలిపి బావ ద్వారా హస్తినకు రాయబారం పంపారట. అది ... తాము కాంగ్రెస్‌కు సహకరిస్తున్నట్టు ఎక్కడా బయటకు పొక్కకూడ దని కాంగ్రెస్ శ్రేణులు తమ కుటుంబాన్ని టార్గెట్ చేయకూడదని. అందుకే హరికృష్ణ తన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసి చడిచప్పుడూ లేకుండా ఇంట్లో తొంగున్నాడు. ఎప్పుడూ తెలుగువారి ఆత్మగౌరవానికి ఎప్పుడు భంగం కలిగినా మా నందమూరి హీరోలు అవతరిస్తామంటూ బీషణ ప్రతిజ్ఙలు చేసి తొడలు చరుసుకునే వీరు ఏకంగా తెలుగు వారి ఏకైక రాష్ట్రం నిట్టనిలువునా చీలిపోతున్నా ఉలుకూ పలుకూ లేకుండా ఇంట్లో తడిగుడ్డేసుకుని తొంగున్న  ఈ ఫేమిలీ డ్రామాను చూసి జనంలో అనుమానం రేకెత్తింది. అసలు వీళ్ళకేమయ్యింది ... తెలుగువాడి ఆత్మ గౌరవానికి ఇంత భంగం కలుగుతున్నా నందమూరి హీరోలనుండి ఒక్కరూ బయటకు రారేంటీ అని జనానికి  డౌటు రావడంతో అసలు విషయం చల్లగా బయటపడింది. ఈ విషయంలో ఎప్పటిలానే నందమూరు ఫేమిలీకి కావలసిన ఒక పెద్దమనిషి సోనియాకు వీళ్ళకు మధ్య రాయబారం నడిపినట్టు బోగట్టా. అయితే ఇందులో పురంధేశ్వరి అత్యంత ప్రముఖ పాత్రను ... అంటే ఈ ఆఫర్‌కు అనుకూలంగా ఫేమిలీని ఒకతాటిపైకి తేవడంలో కీలక పాత్ర పోషించిందట. ఇప్పటికే పార్లమెంటులో తండ్రి విగ్రహాన్ని ప్రతిష్టించడంలో చక్రం తిప్పిన ఈ చిన్నమ్మ తండ్రికి భారత అత్యున్నత అవార్డు ఇప్పించడంలో కూడ కీలక భూమికను నిర్వహిస్తుందన్న మాట. ఇటువంటి పుత్రికను కన్నందుకు NTR బ్రతికుంటె ఎంతో సంతోషించేవాడు. కొసమెరుపు ఏంటంటే ... అవార్డును వచ్చె ఎన్నికల అనంతరం ఇవ్వాలని నిర్ణయించడం( అధికారంలో ఏ ప్రభుత్వమున్నా సరే ). బ్రతికుండగా పార్టీ నుండి పదవి నుండి తన్ని తగలేసి  మీద చెప్పులేయించి చనిపోయిన తరువాత విగ్రహాలు పెట్టించి అవార్డుల కోసం ప్రయత్నించి మళ్ళీ ఆ క్రెడిట్ మాకె దక్కలంటూ ఫేమిలీ డ్రామాను సినిమా కంటే రసవత్తరంగా నడిపిస్తున్న ఈ పొలిటికల్ - సినీ కుటుంబాన్ని చూసి జనం నోరెళ్ళబెట్టాల్సిందే